తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు బ్రిడ్జి మూతపడుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 26 వరకు వాహన రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. రూ.2.10 కోట్లతో వంతెనపై దెబ్బతిన్న రహదారి, సెకండరీ జాయింట్స్, విద్యుత్ పనులను చేపట్టడానికి నిధులు మంజూరయ్యాయి. దీంతో వాహన రాకపోకలను నిలుపుదలచేసి మరమ్మతులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను గామన్ బ్రిడ్జి మీదుగా ట్రాఫిక్ మళ్లింపు.
ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ముఖ్యమైన గమనిక. రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన మూతపడుతోంది. వంతెన మరమ్మతులు, రోడ్డు నిర్మాణానికి ఈనెల 27 నుంచి అక్టోబర్ 26 వరకు రాకపోకలను నిలిపివేయనున్నట్లు రోడ్‌కం రైలు వంతెనపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెల రోజులపాటు బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి ఉండదన్నారు.
ఈ దఫా రూ.2.10 కోట్లతో సెంట్రల్ క్యారేజ్‌వే, వయాడక్ట్ భాగం, అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ జాయింట్లకు మరమ్మతులు చేపట్టబోతున్నారు. ఇప్పటికే మిల్లింగ్ మెషీన్‌తో బీటీ సర్ఫేస్ తొలగింపు తదితర పనులు చేపట్టారు. బ్రిడ్జి మూసివేతపై జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు.
రోడ్డు కం రైలు వంతెనపై ట్రాఫిక్‌ని ఆర్‌సీఆర్‌బీపై పూర్తిగా నిలిపివేస్తున్నారు. కొవ్వూరు వైపు నుంచి రాజమహేంద్రవరం రావడానికి ఆర్‌సీఆర్‌బీ ప్రధాన ప్రవేశ మార్గం. అయితే గత కొంతకాలంగా తరచుగా మరమ్మతుల నిమిత్తం రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నారు. కొవ్వూరు వైపు నుంచి రాజమహేంద్రవరం వివిధ పనులపై నిత్యం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. విద్యార్థులు కాలేజీలకు రావడానికీ ఇదే దగ్గరి మార్గం. ఆర్‌సీఆర్‌బీ మూసివేస్తే విజ్జేశ్వరం, ధవళేశ్వరం మీదుగా.. లేదా ఇటువైపు గామన్ బ్రిడ్జి గుండా ఆల్‌రౌండ్ తిరిగి రావాల్సి ఉంటుంది.
అలాగే ఆర్టీసీ బస్సులు గామన్ బ్రిడ్జి మీదుగానే నడిచే అవకాశం ఉంది. బ్రిడ్జి మూసివేతపై జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు ముందస్తుగా సమాచారం తెలియజేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. గత పుష్కరాల నుంచి అనేక సార్లు మరమ్మతులు, అత్యవసర పనులంటూ వంతెనపై ప్రయాణాలను నిలిపివేశారు. జులై 23 నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సులు, భారీ వాహనాలను అనుమతించని విషయం తెలిసిందే. తాజాగా మరోసారి రాకపోకలకు నిషేధం విధించడంతో ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు.
Leave A Reply
Your email address will not be published.*