ఏపీలోని రెండు జిల్లాల సరిహద్దులో విలువైన లిథియం నిల్వలు గుర్తించిన జీఎస్‌ఐ. మూడు మండలాల్లో ఈ నిల్వలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా కూడా వేశారు. కొంతకాల క్రితం జీఎస్‌ఐ నివేదికను కేంద్రానికి అందించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎంతమేర లిథియం నిల్వలు ఉన్నాయన్నది ఇంకా క్లారిటీ లేదు. లిథియం కాబట్టి డీఏఈ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇటీవలో ఏపీలోని మూడు జిల్లాల్లో బంగారం గనుల్ని కూడా గుర్తించారు.

ఏపీలో అరుదైన ఖనిజం నిల్వల్ని గుర్తించారు. అనంతపురం, కడప జిల్లాల్లో లిథియం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. జమ్మూ కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున లిథియం నిల్వలను కొద్దినెలల కిందట గుర్తించగా.. ఏపీలోనూ అనంతపురం, కడప జిల్లాల సరిహద్దులో ఈ నిల్వలు ఉన్నట్లు జీఎస్‌ఐ (జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా) నివేదిక ఇచ్చింది. ఈ రెండు జిల్లాల్లోని లింగాల, తాడిమర్రి, ఎల్లనూరు మండలాల్లో దాదాపు 5 చదరపు కి.మీ. (500 హెక్టార్ల) మేర ఈ నిల్వలు ఉంటాయని జీఎస్‌ఐ ప్రాథమికంగా అంచనా వేసింది.

సంవత్సరం మారితే రాతలు ఏమీ మారవు ప్రయత్నాలను ఆపితే పనులేవీ సాగవు.

ముఖ్యంగా పెంచికల బసిరెడ్డి జలాశయం (గతంలో చిత్రావతి బ్యాలెన్సింగ్‌ జలాశయం) చుట్టుపక్కల ఈ నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు అధికారులు. ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో వాగులు, వంకలు, ఇతర ప్రాంతాల్లో ప్రాథమిక సర్వేలో లిథియం నమూనాలను గుర్తించారు. కొన్ని నెలల కిందట జీఎస్‌ఐ తన నివేదికను కేంద్రప్రభుత్వానికి అందజేసింది. కచ్చితంగా ఎంతమేర లిథియం నిల్వలు ఉన్నాయనేది త్వరలోనే స్పష్టత వస్తుంది అంటున్నారు. ఈ ఖనిజాల కోసం అన్వేషణకు అనుమతులివ్వాలని ఏపీ గనులశాఖ కొద్ది రోజుల క్రితం కేంద్రాన్ని కోరింది. అయితే లిథియం పరమాణు ఖనిజం కావడంతో అణు ఇంధన సంస్థ (డీఏఈ) నుంచి అనుమతి తీసుకోవాలని కేంద్రం సూచించింది.

అంతేకాదు ఇటీవల ఏపీలో బంగారం గనుల్ని కూడా గుర్తించిన సంగతి తెలిసిందే. నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాల గనులు ఉన్నాయని గుర్తించారట.. అక్కడ గనుల బ్లాకుల్ని కేటాయించాలని ఎన్‌ఎండీసీ కోరింది. ఈ విషయాన్ని తమ వార్షిక నివేదికలో తెలిపింది. రాష్ట్రంలోని గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునే అవకాశం కల్పించాలని కోరారని చెబుతున్నారు. ఇప్పుడు లిథియం నిల్వలు కూడా ఉన్నట్లు గుర్తించారు.


Leave A Reply

Your email address will not be published.*